హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన నివాసంలో కుటుంబసభ్యుల నడుమ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. రంగవల్లులు, అలంకరణలతో ఇంట్లో సంక్రాంతి శోభ వెల్లివిరిసిం ది. గురువారం తన సతీమణి, పిల్లలతో ఎర్రవల్లి నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన తల్లిదండ్రులు కల్వకుంట్ల శోభమ్మ, చంద్రశేఖర్‌రావు ఆశీస్సులు తీసుకున్నారు. కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్యను దీవించిన కేసీఆర్ దంపతులు, వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.