హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అధికారిక ప్రకటన హస్యాస్పదమని, తనకు చాలా బాధేసిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సమన్వయకర్త భూక్య సంజీవ్‌నాయక్ తెలిపారు. హైదరాబాద్ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, 3, డీఎస్సీలోఅదనపు పోస్టులు పెంచాలని కోరారు. టీజీపీఎస్సీ ముట్టడిని విజయవంతం చేసిన ప్రతి ఒక్క నిరుద్యోగికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ వంటి తమ న్యాయపరమైన డిమాండ్లను సాధించుకునేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతరం ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.