హైదరాబాద్, జూన్ 30(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నూతన చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని ఆరో అంతస్తులో ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన సీఎస్‌కు పలువురు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు అభినందనలు తెలిపారు. విరమణ పొందిన రామకృష్ణారావు స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్ జాజును సీఎస్‌గా ప్రభుత్వం ఇటీవలే నియమించింది. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన ఆయనను అనూహ్యంగా సీఎస్‌గా నియమించడం చర్చనీయాంశంగా మారింది.
అటవీశాఖ ప్రధాన అధికారిగా వినయ్‌కుమార్ బాధ్యతలు
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : నూతన ప్రధాన అటవీ అధికారి(పీసీసీఎఫ్)గా వినయ్‌కుమార్ సోమవారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన మాజీ పీసీసీఎఫ్(హెచ్వోఎఫ్ఎఫ్) డాక్డర్ సువర్ణకు అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో డాక్టర్ సువర్ణ మాట్లాడుతూ అటవీశాఖలో సేవలందించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. 35 ఏండ్ల తన సర్వీసులో సుమారు 300 మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించడం ఆనందగా ఉన్నట్టు వెల్లడించారు.
ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శిగా రవి
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శిగా గాదగోని రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంసీపీఐ(యూ), ఎం సీపీ పార్టీలు ఎనిమిదేండ్లుగా వేర్వేరుగా పనిచేస్తూ మంగళవారం కలిసి ఒకే కమిటీగా ఏర్పడినట్లు ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు వనం సుధాకర్ వెల్లడించారు. ఈ మేరకు ఎంసీపీఐ(యూ)పేరుతో జాతీయ స్థాయిలో ఏకీకరణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈనెల 29న వరంగల్‌లో జరిగిన ఏకీకరణ సమావేశంలో నూత న రాష్ట్ర కార్యదర్శి కమిటీ, రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. 23 మందితో రాష్ట్ర కార్యదర్శి కమిటీ, 70 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులోప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు.