హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ) : రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆస్తుల తనిఖీ చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పంచాయతీ అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా పంచాయతీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, గ్రామస్థాయి ఆస్తుల నిర్వహణ స్థితిపై సమీక్షించారు. డంప్‌యార్డ్, వైకుంఠధామం, నర్సరీ, మొకల పెంపకం, ప్రకృతివనం, క్రీడా ప్రాంగణం, తడి, పొడి చెత్త సేకరణ తదితర పనులు సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.