వీణవంక, జనవరి 11: ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బ్రేక్ ఫెయిల్ కావడంతో కెనాల్లో బోల్తా పడింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలోని మానేరువాగు నుంచి ఇసుక లోడ్‌తో కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ అచ్చంపల్లి వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో ఒక్కసారిగా డ్రైవర్ రివర్స్ గేర్ వేశాడు. దీంతో ఇసుకలారీ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, ప్రాణాపాయం తప్పింది. లారీలో ఉన్న ఇసుక కెనాల్లో పడితే సాగునీరు సరఫరా కాకుండా ఆగిపోయే పరిస్థితి ఉన్నదని, వెంటనే లారీతోపాటు ఇసుకను బయటికి తీయాలని రైతులు కోరుతున్నారు.