హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రెండేండ్లుగా ఈ-కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
పెండింగ్లో ఉన్న జీవిత బీమా మెచ్యూరిటీ, సరెండర్ లీవులు, జీపీఎఫ్, 2022 పీఆర్సీ ఎరియర్స్, మెడికల్ బిల్లులను విడుదల చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నయ్య, భిక్షంగౌడ్ సోమవారం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావును కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.