హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సైనిక్‌స్కూల్స్… జాతీయంగా ఉన్నవే 12. వీటిలోని సీట్లను ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ ద్వారా భర్తీచేస్తారు. రాష్ర్టానికి చెందిన 200 మంది విద్యార్థులు ఏపీలోని కోరుకొండ, కలికిరితోపాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, తమిళనాడు, జార్ఖండ్ రాష్ర్టాల్లోని సైనిక్ స్కూళ్లల్లోనూ చదువుకుంటున్నారు.
వీటిల్లో ఒక్కో విద్యార్థికి రూ.లక్షా 60వేల నుంచి లక్షా80వేల వరకు ఫీజుగా తీసుకుంటారు. ఈ మొత్తాన్ని స్కాలర్షిప్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇది వరకు తమిళనాడు అమరావతినగర్‌లోని సైనిక్ స్కూల్లోని ఐదుగురు, ఝార్ఖండ్‌లోని తిలాల్యా సైనిక్ స్కూల్లోని ఏడుగురు విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించింది. అయితే ఈ ఏడాది మొత్తం స్కాలర్షిప్ను ఇవ్వలేమని, కేవలం రూ.15 -20వేలు మాత్రమే ఇస్తామని విద్యాశాఖ వర్గాలంటున్నాయి.
వాస్తవానికి ఇది మొత్తం ఫీజులో 10శాతం కూడా కాదు. ఇన్నాళ్లు పూర్తి స్కాలర్షిప్రాగా, ఇప్పుడేమో అరకొరే ఇస్తామంటుండటంతో తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. దీంతో తల్లిదండ్రులు ఇటీవలే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, విద్యాశాఖ అధికారులను కలిసి పూర్తిస్కాలర్షిప్ను ఇప్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. గతంలో చెల్లించినట్లుగానే పూర్తి ఫీజులు చెల్లించాలని కోరారు.