హైదరాబాద్, సెప్టెంబర్29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు(ట్రిబ్) చైర్మన్గా ఎంజేపీ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లోని బోధన పోస్టుల భర్తీని ట్రిబ్ నిర్వర్తిస్తుంది.
బోర్డు సొసైటీలకు చెందిన కార్యదర్శుల్లో సీనియర్ అధికారి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇప్పటివరకు మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి అయేషా మస్రత్ఖానమ్ చైర్మన్గా వ్యవహరించగా, ఇటీవలనే ఆమెను ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటి నుంచి చైర్మన్ పదవి ఖాళీగా ఉండగా.. ఎంజేపీ కార్యదర్శి సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.