నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ 5 రోజుల కస్టడీ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆయనను నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం లక్ష్మీనారాయణను రిమాండ్‌కు తరలించాలని జడ్జి సురేశ్ ఆదేశించడంతో అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రీ-లాంచ్ ఆఫర్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి హైదరాబాద్‌లో ఎంతో మందిని మోసగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మీనారాయణను ఈ నెల 14 నుంచి 18 వరకు ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణకు సంబంధించిన మెమోను శుక్రవారం కోర్టుకు సమర్పించిన ఈడీ అధికారులు త్వరలో ఈ కేసు చార్జిషీట్‌ను దాఖలు చేయనున్నారు.