హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మహిళలు పవిత్రంగా జరుపుకొనే సద్దుల బతుకమ్మను ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ (టీఎస్ఎస్ఏ) కోరింది. వారు మంగళవారం సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. 10న(గురువారం) ఐచ్ఛిక సెలవుగా కాకుండా, అధికారిక సెలవుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సురేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ పాల్గొన్నారు.
నేటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు బుధవారం నుంచి దసరా సెలవులు ప్రకటించారు. మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 (సోమవారం) వరకు సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు విధిగా ఉత్తర్వులను పాటించాలని సూచించారు.