Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ మంత్రులకు కౌంటర్ ఇస్తున్నారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా రెడ్డి (Sabitha Reddy), మంత్రి సీతక్క (Seethakka) మధ్య మాటల యుద్ధం నడిచింది. నన్ను దొరసాని అని ఎలా అంటారు? అని సబితా రెడ్డి ప్రశ్నించారు. సీతక్క కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్‌లోనే పెరిగినట్టు మాట్లాడుతుందని ఆమె విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం పాత్రను బీఆర్ఎస్ పార్టీ సమర్ధంగా పోషిస్తోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎమ్మెల్యేలు ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే సబితా రెడ్డి మంత్రి సీతక్క వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. ‘వాళ్ల కేటగిరీ వేరు, నా కేటగిరీ వేరు’ అని సీతక్క అనడాన్ని సబిత తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్‌లోనే పెరిగినట్టు మాట్లాడుతుందని ఆమె విమర్శించారు.
సీతక్క కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్టు మాట్లాడుతుంది
నా మీద రేవంత్ రెడ్డి కామెంట్ చేసేవరకు నేను ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడలేదు
కానీ రాజశేఖర్ రెడ్డిని కొట్టడానికి నా మీద 5 సీబీఐ కేసులు పెట్టింది కూడా అదే కాంగ్రెస్ పార్టీ – మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా… https://t.co/Hnx29Go9vz pic.twitter.com/gDC9XEJlzq
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
‘నామీద రేవంత్ రెడ్డి కామెంట్ చేసేవరకు నేను ఎన్నడకూ కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పిన సబిత కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే సీఎం మెప్పు పొందవచ్చని కొందరు భావిస్తున్నార’ని మండిపడ్డారు. అంతేకాదు మాజీ సీఎం, దివంగత రాజశేఖర్ రెడ్డిని కొట్టడానికి తనపై సీబీఐ కేసులు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని సబిత ఫైరయ్యారు. తనపై ఐదు కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నాని పేర్కొన్న ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యవస్థలోని లోపాను ఎత్తి చూపుతాం తప్ప వేరే ఉద్దేశం లేదని సబిత స్పష్టం చేశారు.