బడంగ్‌పేట, జులై5 : అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమా న్ని ఆపలేరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబి తా ఇంద్రారెడ్డి చెప్పా రు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి ఎందుకివ్వలేదో నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దొంగ హామీలిచ్చి నిరుద్యోగులను ఎందుకు మో సం చేశారని ప్రశ్నించారు. ఏడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ వేయలేదని, నిరుద్యోగుల గోసను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు మద్ద తు తెలిపేందుకు వెల్తున్న బీఆర్ఎస్ యువజన నేతలు, విద్యార్థులను అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు.