హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తొలితరం కమ్యూనిస్టు నాయకురాలు ఎస్ సుగుణ (సుగుణక) కన్నుమూశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అగ్రనాయకుల్లో ఒకరైన ఎస్వీకే ప్రసాద్ సతీమణి అయిన సుగుణమ్మ హైదరాబాద్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఆమె మరణవార్త తెలుసుకున్న పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పార్టీ నేతలు చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌కు చేరుకొని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారాయణ, కూనంనేని మాట్లాడుతూ.. తొలితరం కమ్యూనిష్టుపార్టీ నాయకులు ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యంతో కలిసి సుగుణక్క పనిచేశారని గుర్తుచేశారు.