నాకు ఎకరం భూమి ఉన్నది. సరిగ్గా అదును సమయానికి రైతుబంధు సొమ్ము అందుతుంది. సర్కారు ఇచ్చే పైసల తోనే ఏటా నేను మందుకట్టలు, విత్తనాలు కొనుక్కుంటున్నా. మా ఊర్లో అందరూ సాగు ఖర్చులకు రైతుబంధు కోసం ఎదురుచూస్తరు. సీజన్‌కు ముందు రైతులు ఎలాంటి ఇబ్బంది పడుతరో కేసీఆర్ సార్‌కు తెలుసు. రైతుబంధు సొమ్ము లేకపోతే వ్యాపారుల వద్ద అధిక వడ్డీలు తెచ్చుకోక తప్పదు. ఈ మధ్య అసలు అప్పు కూడా దొరకడం లేదు. సరైన సమయానికి ఆదుకొంటున్న సర్కారుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. రైతుబంధు వచ్చిన తరువాత రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేస్తలేరు. తెలంగాణ రాకముందు సాగు పనులు మొదలుపెట్టాలంటే ముందుగా అప్పుల కోసం సావుకార్ల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. పంట పండిన తరువాత కనీసం వడ్డీలు కూడా తీర్చలేకపోయేవాళ్లం. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సాయం మరువలేనిది.
– వెలుతూరి నాగేశ్వరరావు, రైతు, పొన్నెకల్లు, ఖమ్మం రూరల్, ఖమ్మం జిల్లా