కాంగ్రెస్ పాలనలో గ్రామీణాభివృద్ధి కుదేలు
కేసీఆర్ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన గ్రామాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిధుల కొరతతో కుదేలయ్యాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గ్రామ పంచాయతీలకు గతంలో ఖర్చు చేసిన నిధులతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వ్యయం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.
- కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీల సగటు వ్యయం రూ.16.59 లక్షలుగా నమోదు
- రేవంత్రెడ్డి పాలనలో రూ.6.24 లక్షలకు పతనం
- ఆర్బీఐ నివేదిక గణాంకాలే నిదర్శనంహైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన గ్రామాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నిధుల కొరతతో కుదేలయ్యాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గ్రామ పంచాయతీలకు గతంలో ఖర్చు చేసిన నిధులతో పోల్చితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వ్యయం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాము చెప్పడం లేదని, ఆర్బీఐ విడుదల చేసిన ‘ఫైనాన్సెస్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్’ నివేదికలోని గణాంకాలే వెల్లడిస్తున్నాయని శనివారం ‘ఎక్స్ వేదిక’గా స్పష్టంచేశారు. గ్రామ పంచాయతీలు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సగటున రూ.16.59 లక్షలు వెచ్చిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం రూ.6.24 లక్షలకు పడిపోయిందని తెలిపారు. జీపీల సగటు వ్యయం గణనీయంగా తగ్గిపోవడం గ్రామీణాభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.నిధులన్నీ ఎటు పోతున్నాయి?
ప్రజలు చెల్లిస్తున్న పన్నులు, ప్రభుత్వం తీసుకొస్తున్న లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎటు వెళ్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిధులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఖజానాలోని నిధులు అభివృద్ధి, సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జీపీలకు నిధులు సమకూర్చి గ్రామీణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశామని, ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్నదంతా అభివృద్ధి కాదని, విధ్వంసమేనని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
- పల్లె నుంచి పట్నం వరకు తెలంగాణలో అభివృద్ధి శూన్యం
- ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

