అప్పులబాధతో రైతు ఆత్మహత్య
అప్పుల భారం తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకొన్నది. పోలీసుల కథనం ప్రకారం.. ముథోల్ మండలం వడ్తాలకు చెందిన రైతు గుండ్ల పండరి (42) వ్యవసాయ అవసరాల కోసం ఇటీవల కొత్త ట్రాక్టర్, రోటవేటర్తోపాటు ఇతర వ్యవసాయ సామగ్రిని కొనుగోలుచేశాడు.
ముథోల్, నవంబర్ 21 : అప్పుల భారం తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకొన్నది. పోలీసుల కథనం ప్రకారం.. ముథోల్ మండలం వడ్తాలకు చెందిన రైతు గుండ్ల పండరి (42) వ్యవసాయ అవసరాల కోసం ఇటీవల కొత్త ట్రాక్టర్, రోటవేటర్తోపాటు ఇతర వ్యవసాయ సామగ్రిని కొనుగోలుచేశాడు. వీటికోసం రూ.10 లక్షల వరకు అప్పుచేశాడు. పంటలు సరిగా పండకపోవడం, అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన పండరి రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. పండరికి భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. పండరి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

