పింఛన్ మంజూరుకు 10వేలు డిమాండ్
వితంతు పింఛన్ మంజూరుకోసం రూ.10వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు.
- ఏసీబీకి చిక్కిన జీపీ కార్యదర్శి
మానకొండూర్ రూరల్, నవంబర్ 21: వితంతు పింఛన్ మంజూరుకోసం రూ.10వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ ఏసీపీ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన ఎడ్ల రాజిరెడ్డి తన కోడలికి వితంతు పెన్షన్‌కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి లావుడ్య చవాన్లాల్ను సంప్రదించగా రూ.10 వేల లంచం డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటీవల కొత్త పింఛన్లు మంజూరు చేయగా, జాబితాలో ఆమె పేరు రావడంతోపాటు ప్రొసీడింగ్స్ సైతం అందుకున్నారు.
వెంటేనే కార్యదర్శి రంగంలోకి దిగి.. ‘పింఛన్ మంజూరైంది కదా..? పై అధికారులకు డబ్బులు ఇవ్వాలంటూ’ ఈ నెల 16, 17, 19 తేదీల్లో రాజిరెడ్డికి ఫోన్‌చేసి వేధించసాగాడు. దీంతో రాజిరెడ్డి శనివారం తన ఇంట్లో రూ.10 వేలు పంచాయతీ కార్యదర్శికి ఇస్తుండగా ఏసీపీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ తిరుపతి, సిబ్బంది ప్రేమ్‌కుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మానకొండూర్ ఎంపీడీవో కార్యాలయంలో పింఛన్ లబ్ధిదారుల వివరాలు సేకరించి, కార్యదర్శిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

