మర్కూక్/ములుగు, ఫిబ్రవరి 28: పల్లెప్రగతి ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి బాగున్నదని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కుమార్ పమ్మీ కొనియాడారు.
మంగళవారం సిద్దిపేట జిల్లా మర్కూక్, ములుగు మండలాల్లో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. మర్కుక్ మండలం దామరకుంటలో ఎన్ఆర్ఈజీఎస్ కింద జరిగిన పనులను పరిశీలించిన తర్వాత ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. పల్లెప్రకృతి వనంలో నాటిన మొక్కలను చూసి అబ్బురమని పేర్కొన్నారు.