రెండోరోజూ ‘ప్రగతి’ జోరు

హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రెండోరోజు శుక్రవారం ఉత్సాహంగా కొనసాగాయి. ప్రతి గ్రామం, పట్టణాల్లోని డివిజన్లు, వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పట్టణ ప్రగతిలో భాగంగా 61,475 మొక్కలు నాటగా, రెండురోజుల్లో కలిపి 1.05 లక్షలు నాటారు. రోడ్డుమధ్యలో 1,891 మీటర్ల పరిధిలో మొక్కలు పెట్టారు. 4 వేల కిలోమీటర్ల పరిధిలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఒక్కో కుటుంబానికి ఆరు చొప్పున 1.23 లక్షల మొక్కలను పంపిణీ చేశారు. మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2,577 కిలోమీటర్ల మేర మొక్కలు నాటారు. 1,014 దళిత బస్తీల్లో అధికారులు పర్యటించి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశారు. 1,967 మీటర్ల మేర వేలాడుతున్న విద్యుత్తు వైర్లను సరిచేశారు. 215 వంగిన, తుప్పు పట్టిన విద్యుత్తు స్తంభాలను మార్చారు. 2,600 టన్నుల చెత్తను ఎత్తిపోశారు. 1,150 టన్నుల శిథిలాలను తొలగించారు. 1,448 కిలోమీటర్ల మురుగు కాలువలను శుభ్రపరిచారు. 1,060 ప్రాంతాల్లో దోమల వ్యాపించకుండా ఫాగింగ్ చేశారు. 174 పార్కులను, 689 ప్రభుత్వ సంస్థలు, దేవాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల ముందు శుభ్రంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

