మోర్తాడ్, ఆగస్టు 23: నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు రైతు ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడి రుణమాఫీ హామీల అమలు కోసం శనివారం తలపెట్టిన మహాధర్నాను విజయవంతం చేసేందుకు తీర్మానాలు చేస్తున్నాయి. ఆర్మూర్ ఏసీపీ బస్వారెడ్డి అనుమతి ఇచ్చారని ఐక్య కార్యాచరణ కమిటీ ఇన్చార్జి ఇట్టడి లింగారెడ్డి తెలిపారు.
కాగా చలో ఆర్మూర్, రాస్తారోకో కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేదని సీపీ కల్మేశ్వర్ తెలిపారు. ఆర్మూర్లో ఈ నెల 23 సాయంత్రం నుంచి 25 ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని చెప్పారు. సమావేశాలు, రాస్తారోకోలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.