జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికారపార్టీ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో స్థానికేతరులకు ప్రవేశం లేదని తెలిసీ మంత్రులు యథేచ్ఛగా తిరిగారు. అయినా ఈసీ, పోలీసులు చోద్యం చూశారు. అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను అడుగడుగునా అడ్డుకున్నారు, ఈడ్చిపారేశారు. కొన్నిచోట్ల చెయ్యి కూడా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ బరితెగింపునకు సాక్ష్యాలివిగో..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్ కాలనీలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి సీతక్క వాహనం

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో పర్యటిస్తున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో పోలీసుల వాగ్వాదం

జూబ్లీహిల్స్‌లోని శంకర్‌లాల్ నగర్లో పర్యటిస్తున్న అమిత్‌రెడ్డి

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్న డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్

డాన్‌బాస్కో స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద నుంచి నంబర్ ప్లేట్ లేని వాహనంలో వెళ్తున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్

బోరబండ వీకర్ సెక్షన్లో కారులో తిరుగుతున్న కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి