హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిషరించకపోతే 19వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) హెచ్చరించింది. కాంగ్రెస్ పార్టీకి అ నుబంధ కార్మిక సంఘం నుంచే తిరుగుబాటు మొదలు కావడంతో ప్రభుత్వ పెద్దల్లోనూ కలవరం మొదలైనట్టు సమాచారం. శుక్రవారం నిర్వహించిన ‘చలో బస్ భవన్’ ముట్టడి కా ర్యక్రమానికి భారీగా కార్మికులు హాజరయ్యా రు.
ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరిస్తామని, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, పీఆర్సీ పరిధిలోకి తీసుకొస్తామని, పెండింగ్ బకాయిలను చెల్లిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మ్యానిఫెస్టోలో పొందుపర్చిందని గుర్తుచేశా రు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా యూనియన్లను పునరుద్ధరించలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని మండిపడ్డారు. సమస్యలు పరిషరిస్తారని ఓట్లు వేసినా.. ఫలితం లేదని కార్మికులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలిపారు.
ఐఎన్టీయూసీ అడిషనల్ జనరల్ సెక్రటరీ డీ గోపాల్ మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యం క్షేత్రస్థాయిలో కార్మికుల పై పెంచుతున్న పని భారాన్ని తగ్గించాలని, వేధింపులు, అక్రమ సస్పెన్షన్లు, బదిలీలు ఆపాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు బోయ యాదయ్య మాట్లాడుతూ రిటైర్డ్ కార్మికులకు సెప్టెంబర్ 2024 నుంచి రావాల్సిన లీవ్ ఎన్క్యాష్మెంట్ చెల్లించాలని కోరారు. సమస్య లు పరిషరించకపోతే కలిసికట్టుగా నిరవధిక నిరాహార దీక్షలో పాల్గొంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేపట్టిన ఆర్టీసీ కార్మికుల విలీన ప్రక్రియ పురోగతి, అపాయింటెడ్ డేను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాదయ్య, నగేశ్, ఎంవీఎన్ రా వు, మనోహర్, శంకరయ్య్య, కృష్ణ, పర్వతా లు, జక్రయ్య, వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు.