హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల(RTC workers) సమ్మె కొనసాగుతున్నది. పోలీసుల పహారా మధ్య బలవంతంగా అద్దె బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ కార్మికులు ఎక్కడి కక్కడ అడ్డుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రైవేట్ డ్రైవర్ల సాయంతో 5 ప్రైవేట్ బస్సులను ఆర్టీసీ అధికారులు బస్సుకొక కానిస్టేబుల్ను సెక్యూరిటీగా ఉంచి నడుపుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ డ్రైవర్లకు దండం పెడుతూ దిగిపోవాలని ఆర్టీసీ కార్మికులు వేడుకుంటున్న దృశ్యం పలువురిని ఆలోచింపజేసింది.
ప్రైవేట్ డ్రైవర్లకు దండం పెడుతూ దిగిపోవాలని వేడుకుంటున్న ఆర్టీసీ కార్మికులు
వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రైవేట్ డ్రైవర్ల సాయంతో 5 ప్రైవేట్ బస్సులను బయటకు వదిలిన ఆర్టీసీ అధికారులు
బస్సుకొక కానిస్టేబుల్ను సెక్యూరిటీగా ఉంచి బయటకు విడుదల
బస్టాండ్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు https://t.co/VzltoD3T9H pic.twitter.com/Dre7DbwUFN
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2026