హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ‘ఫ్రీ బస్‌పాస్ కార్డు’లు ఇవ్వడాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ స్వాగతించింది. జీరో టికెట్ జారీ చేసే విషయంలో కండక్టర్లపై టీటీఐలు అకారణంగా కేసులు నమోదు చేస్తున్నారని, దీంతో ఉన్నతాధికారులు కండక్టర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని చెప్పారు.
జీరో టికెట్‌కు బదులుగా ఉచిత బస్సుపాస్ కార్డ్‌ను ఇవ్వాలని మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ప్రధాన హామీలైన అపాయింటెడ్ డే, యూనియన్ల పునరుద్ధరణ, 2021 -2025 వేతన సవరణ, ఉద్యోగ భద్రత, పనిభారం తగ్గింపు, ఖాళీల భర్తీ వంటి వాటిని కూడా ప్రభు త్వం పరిషరించాలని కోరారు.