TGSRTC | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ ఎన్నికల నిర్వహణ విషయంలో రా ష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏప్రిల్‌లో కోర్టుకు సైతం 3 నెలల్లో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆ తర్వాత కనీస చర్యలు తీసుకోకపోవడంపై కార్మికులు మండిపడుతున్నారు. గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఆరు కార్మిక సంఘాలు ఇటీవల రవాణాశాఖ కమిషనర్‌ను కలిసి కో రాయి.
చివరిసారిగా 2016లో గుర్తిం పు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పు డు తెలంగాణ మజ్దూర్ యూనియన్ గెలిచింది. ఆ తర్వాత ఎన్నికలు జరగలేదు. మోటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కానీ ఈ సర్కారు దానినీ పట్టించుకోవడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రతి డిపోలో ఓ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటుచే స్తూ ఆర్టీసీ యాజమాన్యం కాలయాపన చేస్తున్నది. ట్రేడ్ యూనియన్ల స్థానంలో వెల్ఫేర్ కమిటీలు చట్ట విరుద్ధమని సం ఘాల నాయకులు పేర్కొంటున్నారు.
ఎన్నికలు జరగకుండా యాజమాన్యంలో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి అడ్డుపడుతున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ట్రేడ్ యూనియన్ ఉన్నప్పుడు ఆర్టీసీ రూ.2,500 కోట్ల అప్పుల్లో ఉంటే, ట్రేడ్ యూనియన్ లేకుండా ఎండీ పాలనలో రూ.10 వేల కోట్ల అప్పులకు సంస్థ చేరుకున్నదని తెలిపారు.