హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): కాలుష్య నివారణే లక్ష్యంగా తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని, వాటి పాలసీలో మార్పు తేవాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చన్నైలో ఆదివారం నిర్వహించి న సదస్సులో వక్తలు డిమాండ్ చేశారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్, సబ్సిడీలను నేరుగా ప్రజారవాణా సంస్థలకే ఇవ్వాలని ప్రభుత్వాలకు తేల్చిచెప్పారు. సదస్సులో ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ కరుమలయన్ అధ్యక్షోపన్యాసం చేశారు.
ఆర్టీసీ బస్సుల పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపునిచ్చా రు. ప్రధాని, ముఖ్యమంత్రులకు వినతిపత్రాలు ఇవ్వాలని, రవాణాశాఖ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగాలని, వినియోగదారుల సంతకాలు సేకరించాలని నిర్ణయించారు. సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు సౌందర్‌రాజన్ హాజరై మాట్లాడారు. సదస్సులో తెలంగాణ నుంచి పీ రవీందర్‌రెడ్డి, కే సత్తిరెడ్డి, ఎం ప్రభాకర్, ఎస్ కృష్ణ పాల్గొన్నారు.