హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో కొందరు వ్యక్తులు తమ మనుగడ కోసం ఉద్యోగులను, కార్మికులను రెచ్చగొడుతున్నారని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తుల మాయలో ఉద్యోగులెవ్వరూ పడొద్దని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని టీజీఎస్ఆర్టీసీ కళాభవన్లో మంగళవారం రాష్ట్రస్థాయి ఎంప్లాయ్ వెల్ఫేర్ బోర్డు సభ్యులతో యాజమాన్యం సమావేశమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్ మా ట్లాడుతూ.. ‘మహాలక్ష్మి’ పథకం అమలుతో ఆర్టీసీ సిబ్బందిపై పెరిగిన పనిభారాన్ని తగ్గించేందుకు తాతాలికంగా డ్రైవర్, కండక్టర్ పోస్టులకు నియామకాలు చేపడుతుండటంతో కొందరు వ్యక్తులు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీలో 3,036 రెగ్యులర్ పోస్టుల భర్తీకి ప్ర భుత్వం అనుమతి ఇచ్చి ందని, సాంకేతిక కారణాల వల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని తెలిపారు. ఆ నియమాకాలు కచ్చితంగా జరుగుతాయని, దానిపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, యాజమాన్యం తీసుకునే నిర్ణయాల వెనుక ఉద్యోగులతోపాటు సంస్థ ప్రయోజనాలే ఉంటాయని, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలు ఉండవని తెలిపారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను దశలవారీగా పరిషారిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, ఖుష్రోషా ఖాన్, సొలోమన్, వెంకన్న, రాజశేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్పతో పాటు హెచ్ఓడీలు పాల్గొన్నారు.