హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): ఈ నెల 22 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆర్టీసీ సమ్మెకు మద్దతు పెరుగుతున్నది. ఆర్టీసీ కార్మిక జేఏసీలో లేని సంఘాలు సైతం సానుకూలంగా స్పందించాయి. తాజా గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్), ఆర్టీసీ కార్మిక సమాఖ్య సమ్మెకు తమ సంపూర్ణ మద్దతును తెలిపాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆర్టీసీ కార్మిక జేఏ సీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఓ వైపు సమ్మె సన్నాహక సమావేశాలు, భేటీ లు, గేట్ ధర్నాలతో కార్మికుల్లో చైతన్యం రగిలిస్తున్నారు. సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు ప్రకటించారు. హక్కుల సాధన కోసం చేపట్టిన సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ వివిధ జిల్లాల్లో జేఏసీ నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వర కూ గేట్ మీటింగ్‌లు, సమ్మె సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో విలీ నం కోసం కార్మికులు పట్టుబడుతుండటం తో సమ్మె విజయవంతం అవుతుందని నేత లు పట్టుదలతో ఉన్నారు. జేఏసీలో లేని మిగతా సంఘాలు కూడా కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా సమ్మెకు విశాల మద్దతు ఇ వ్వాలని కార్మిక జేఏసీ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. 22 నుంచి ఆర్టీసీ కార్మిక జేఏసీ తలపెట్టిన సమ్మెకు మద్దతు ప్రకటించిన ఎస్‌డబ్ల్యూఎఫ్, ఇతర సంఘాలకు జేఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ నిర్ణయాన్ని జేఏసీ స్వాగతిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి ఇతర సభ్యులు తెలిపారు.
6 సంఘాల సమ్మె పిలుపునకు ఎస్‌డబ్ల్యూఎఫ్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ రావు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం తీరు సమంజసంగా లేదని విమర్శించారు. రెండున్నరేండ్లలో ఒకసారి కూడా కార్మిక సంఘాలతో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సమావే శం నిర్వహించి చర్చలు జరుపనే లేదని తెలిపారు. ఒక సమస్య పరిషారానికీ ప్రయ త్నం చేయకుండా కాలయాపన చేయడం, కార్మికోద్యమంపై ఆంక్షలు కొనసాగించడం సరైంది కాదని చెప్పారు.
తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరుపాలని రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం డిమాండ్ చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఏప్రిల్ 18, 19, 20న అన్ని డిపోల వద్ద రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ తీర్మానించినట్టు తెలిపారు. 20న డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజ రు కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యలు పరిషరించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి కోరారు. లేకపోతే సమస్యల పరిషారం కోసం సమ్మె అనివార్యమైతే తామూ పాల్గొంటామని తెలిపారు.
బోధన్, ఏప్రిల్ 17: ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాల్సిందేనని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఏఆర్‌రెడ్డి, థామస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక దొడ్డిదారిన ఆర్టీసీని నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్మికులపై పనిభారం, వేధింపులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తంచేశారు. రెండు పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలని, ఆర్టీసీ బస్సులను ఆధునికీకరించి విస్తరించాలని, యూనియన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించక పోతే ఈనెల 22 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చే సేందుకు యాజమాన్యం, ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతున్నాయి. ‘మేము ఈ స మ్మెలో పాల్గొనబోము’ అని వివిధ డిపో ల్లో కార్మికులతో ఆర్టీసీ ఉన్నతాధికారులు సంతకాలు తీసుకుంటున్నారు. ఒకవేళ సమ్మెకు వెళ్తే యాజమాన్యం తీసుకునే చర్యలకు బాధ్యత వహించాలని నేరుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం కార్మిక జేఏసీకి చేరడంతో కార్మికులకు భరోసా కల్పించింది. సమ్మెకు విరుద్ధంగా ఎవరూ సంతకాలు పెట్టవద్దని జేఏ సీ కోరింది. ఎవరైనా బలవంతంగా బెదిరించేలా మాట్లాడినా, సంతకాలు పెట్టాలని కోరినా ఆ అధికారుల వివరాలను జేఏసీకి ఇవ్వాలని కోరింది. కార్మికుల ఐక్యతను దెబ్బతీసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. ఈ ఉద్యమానికి అధికారులు కూడా సహకరించాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది.