జగిత్యాల, మే 25 (నమస్తే తెలంగాణ) : ‘పెట్రోల్ ధరలు తగ్గించవచ్చు గానీ, ముందు వడ్లు, మక్కలు కొనే ముచ్చట చూడండి. వాటిని కాపాడండి’ అంటూ ఆర్టీసీ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సాక్షాత్తు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలోనే ఆర్టీసీ డ్రైవర్.. ‘వడ్లు, మక్కలను కాపాడండి’ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పురాతన ఉన్నత పాఠశాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు జగిత్యాల ఆర్డీవో ఆఫీస్ వరకు ర్యాలీ తీశారు. ఈ క్రమంలోనే బస్‌స్టాండ్‌కు వస్తున్న ఆర్టీసీ బస్సును పోలీసులు దారి మళ్లించారు. బస్సు డ్రైవర్ ధర్నాను గమనిస్తూ.. ‘వడ్లు, మకల గురించి పట్టించుకోండి. పెట్రోల్ రేట్లు ఎప్పుడైనా దించుకోవచ్చు’ అంటూ వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆకర్షించింది. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ అశోక్‌పై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించినట్టు సమాచారం