రాయికోడ్,మే1: పర్యవేక్షణ అధికారే కండక్టర్‌ను లంచం అడగడంతో ప్రయాణికులు దేహశుద్ధి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌లో చోటుచేసుకున్నది.హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం 8గంటలకు బయలుదేరింది. కప్పాడు వద్ద ఇద్దరు టీటీఈలు వచ్చి తనిఖీలు చేయగా ప్రయాణికుడికి జీరో టికెట్ ఇచ్చినట్టు గుర్తించారు. టికెట్ తప్పు కొట్టినందుకు చార్జి మెమో రాకుండా ఉండాలంటే రూ.20 వేల లంచం ఇవ్వాలని ఓ టీటీఈ కండక్టర్‌ను డిమాండ్ చేశాడు. బస్సులో పరిమితికి మించి 120 మంది ప్రయాణికులు ఎక్కారని, పని ఒత్తిడిలో పొరపాటు జరిగిందని టీటీఈకి కండక్టర్ వివరించాడు.
కండక్టర్ వాదనను టీటీఈ వినిపించుకోకుండా లంచం ఇవ్వాలని బస్సులో ఉన్న డ్రైవర్, ఇతర ప్రయాణికులకు వినపడేలా అరిచాడు. ఈ క్రమంలో బస్సు రాయికోడ్ బస్‌స్టాండ్‌కు చేరుకుంది. దీంతో ఆగ్రహించిన కండక్టర్‌తోపాటు ప్రయాణికులు టీటీఈని చెప్పులతో కొట్టారు. టీటీలు ఏస య్య, ప్రకాశ్ రాయికోడ్ పోలీస్‌స్టేషన్‌లో కండక్టర్ వసంత్‌పై ఫిర్యాదు చేశారు. శాఖాపరమైన చర్యలకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదేశించారు.