తిమ్మాపూర్, నవంబర్ 4 : ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో 15 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేదునూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం లోడ్ చేసుకుని తెల్లవారుజామున 4 గంటల సమయంలో రైస్‌మిల్‌కు వెళ్తున్న ట్రాక్టర్‌ను హైదరాబాద్ నుంచి మెట్‌పల్లికి వెళ్తున్న మెట్పల్లి డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
దీంతో ట్రాక్టర్ పక్కనున్న కాలువలో పడిపోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన ట్రాక్టర్ డ్రైవర్ రవి వెంటనే దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉండగా.. 15 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డవారిని దవాఖానకు తరలించారు. ప్రయాణికుడి ఫిర్యాదుతో డ్రైవర్ ఎల్లారెడ్డిపై కేసు నమోదైంది.