పెద్దపల్లి, జూలై 20 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక్క శాతమైనా తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్తు మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో అజీం ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్థులకు సోమవారం ఆయన పత్రాలను పంపిణీ చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి రూ.12 వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా మోసం చేసిందని తెలిపారు. కళాశాల యాజమాన్యాలను విద్యార్థుల నుంచే నేరుగా ఫీజులు వసూలు చేసుకోవాలని చెప్తుండడంతో పేద విద్యార్థులపై ఆర్థిక భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఢిల్లీకి మూటలు పంపించడం, మంత్రులు, ఎమ్మెల్యేలకు కాంట్రాక్టులు ఇవ్వడంంపై ఉన్న శ్రద్ధ పేద విద్యార్థులకు ఉన్నత చదువును అందించడంపై ముఖ్యమంత్రికి లేదని మండిపడ్డారు.