హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డినే గతంలో చెప్పాడు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ దేశ రక్షణ కోసం పోలీసులు చేస్తారు. ఫోన్ ట్యాప్ చేయడం నేరం కాదని.. దేశ రక్షణ కోసం ట్యాపింగ్ చేయవచ్చని నాడు ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పిన వీడియోని చూపించారు. మరి ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నేతలపై ట్యాపింగ్ మీద కేసులు పెడుతున్నాడని విమర్శించారు.
అన్ని ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. కానీ దీని మీద ఏ రాష్ట్రంలో కూడా చర్చ జరగడం లేదని దేశ భద్రత రీత్యా ఫోన్ ట్యాపింగ్ నేరం కాదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కేటీఆర్‌ను ఏమీ చేయలేరన్నారు. బీఆర్ఎస్ ఫార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.