హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూకి చెందిన కంచ గచ్చిబౌలిలోని భూముల్లో పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఫిర్యాదు చేశారు.
బుధవారం అరణ్య భవన్లో ఈ మేరకు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఆటవీ సంరక్షణ చట్టం 1980, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లను ఉల్లంఘించారని, బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిరుమళ్ల రాకేశ్, కురువ విజయ్‌కుమార్, కిశోర్‌గౌడ్, మన్నె గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.