హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ‘కోచిం గ్ సెంటర్ల నిర్వాహకులు 100 కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు’ అని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.కోచింగ్ సెంటర్ల నిర్వాహకులపై సీఎం వ్యాఖ్యలపై బుధవారం ఆయన తీవ్రంగా స్పందించారు. నిరుద్యోగులను కిరాయి మనుషులుగా పేర్కొనటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీని అశోక్‌నగర్‌కు తీసుకెళ్లినప్పుడు రేవంత్‌రెడ్డి సహా ఇతరుల వెంట ఉన్నది కిరాయి మనుషులేనా? అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్- 1కు 1:100 పిలిచినపుడు ఇక్కడెందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు సంఘీభావం తెలిపిన ప్రతి వ్యక్తిని తలకుమాసినోడుగా సీఎం అభివర్ణిస్తున్నారని, 2023లో ఇదే పని చేసిన రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీని ఏమనాలని ఆయన ప్రశ్నించారు.