కాగజ్‌నగర్, మార్చి 24 : అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశా రు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం ఈస్గాం గ్రామ పంచాయతీ పరిధిలో నష్టపోయిన పంటలను సోమవారం పరిశీలించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి పంట నష్టంపై ఎలాం టి ప్రకటన చేయకపోవడం శోచనీయమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు రై తుల పట్ల ప్రేమ ఉంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో రిజిస్ట్రేషన్ చేయించి సాయం అందించేలా కృషి చేయాలని డిమాండ్ చేశా రు. నాలుగు రోజులుగా అనేక గ్రామాలకు విద్యుత్తు సరఫరా లేకపోయినా పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ; ఎకరానికి రూ.10వేలు పరిహారం చెల్లించాలి
హైదరాబాద్,మార్చి24 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలు, వడగండ్లతో వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి టీ సాగర్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చే శారు. ముఖ్యంగా మకజొన్న, వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అలాగే పిడుగుపాటుకు ఇద్దరు మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. నష్టాన్ని ప్రాథమి క అంచనాగా రూ.11వేల కోట్లు మాత్రమే జరిగిందని ప్రకటించారని, ఇది వాస్తవం కాదని మండిపడ్డారు. కేంద్రం 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వా రా ప్రకృతి వైపరీత్యాల కింద కేటాయించిన నిధులు కూడా రైతులకు ఇ వ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రారంభించలేదని, “పీఎం ఫసల్ బీమా”లో చేరినప్పటికీ ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు పరిహారం రాదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా పూర్తి పరిహారాన్ని రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. రానున్న నెలరోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంతోపాటు రైతులకు సలహాలు, సూచనలు అందించాలని వారు డిమాండ్ చేశారు.