హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో ఆదిలాబాద్ నుంచి అలంపూ ర్ వరకు, కొడంగల్ నుంచి కోదాడ దాకా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశా ల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేస్తారనే భయంతో జైలుకు పంపించే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ హకులు కాపాడాల్సిన పోలీసులు, సీఎం రేవంత్‌రెడ్డికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణభవన్ లో గురువారం ఆయన బీఆర్ఎస్ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, రంగినేని అభిలాష్, మ నోహర్‌రెడ్డి, గోపగాని రఘురామ్‌తో కలి మీడియాతో మాట్లాడారు. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసులు కొందరు కాంగ్రెస్, రేవంత్ ప్రొటెక్షన్ ఫో ర్స్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
గాంధీభవన్ ఆదేశాలతో, కాంగ్రెస్ లీగల్ సెల్ కంటెంట్‌తో బీఆర్ఎస్ నేతలు, సోష ల్ మీడియా వారియర్లపై ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయని మండిపడ్డారు. తా ము అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులను రద్దు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, రేవంత్ సోదరులు రాజ్యాంగేతర శక్తులు గా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్‌రెడ్డి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా మారడం తెలంగాణ ప్రజల దురదృష్టమని వాపోయారు. తనకు ప్రాణహాని ఉన్నదని, ఫోన్ ట్యాప్ అవుతున్నదని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పైనే ఉల్టా కేసు పెట్టడం హాస్యాస్పదమని మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డిని అరెస్ట్‌చేసి బంజారాహి ల్స్ పోలీస్‌స్టేషన్‌లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2 లక్షల మంది ప్రజలకు ప్రతినిధి అయిన కౌశిక్‌రెడ్డికి రక్షణ కల్పించని పోలీస్‌శాఖ, వార్డు సభ్యులు కూడా కాని రేవంత్ సోదరులకు మాత్రం భారీ కాన్వాయ్‌తో భద్రత కల్పిస్తున్నదని విమర్శించారు.
ఫిర్యాదు చేస్తే కేసులెందుకు పెట్టరు?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని ఇష్టమొచ్చినట్టు రేవంత్‌రెడ్డి తి ట్టారని, ఆయనపై బీఎన్ఎస్ యాక్ట్ ప్రకా రం కేసు ఎందుకు పెట్టడం లేదని ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. రేవంత్‌రెడ్డిపై, ఆయ న సోదరులపై కేసు పెట్టడానికి పోలీసులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించా రు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఇవ్వని వాంగ్మూలాన్ని ఇచ్చినట్టు మార్చారని, 25 రోజులుగా ఆయనను కుటుంబానికి దూరం చేశారని మండిపడ్డారు. హా మీలపై నిలదీసిన ఎంతమందిని అక్రమ కేసులతో అరెస్టు చేసి జైళ్లకు పంపుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జైళ్లలో ఉండాల్సిన ఖైదీల సంఖ్య ఏడు వేలు మాత్రమేనని, తెలంగాణలోని 4 కోట్ల మంది ఎదురుతిరుగుతున్నారని, వారిని ఏ జైళ్లలో పెడతారని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి తెల్లవారుజామున, రాత్రి పూట జడ్జిల ముందు నిలబెడుతున్నారని, కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ఈ ప్రభుత్వ వైఖరి మారడం లేదని మం డిపడ్డారు. పోలీసుల పక్షపాత వైఖరిని డీజీపీ, రాష్ట్ర ప్రజలు గమనించాలని కో రారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.