హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్య క్తులు చేసిన తప్పును మొత్తం వ్యవస్థకు ఆపాదించడానికి బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మొదటి నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నారు. కమిషన్ లో పనిజేసే కొందరికి 100పైగా మా ర్కులు వచ్చాయని అందులో మద్ది వెం కటేశ్వర్లుకు 120 మార్కులు వచ్చాయ ని ట్వీట్ చేశారు.
ఆయన టీఎస్పీఎస్సీ కస్టోడియన్ ఆఫీసర్ శంకరలక్ష్మికి మి త్రుడని ట్విట్టర్లో రాసుకొచ్చారు. కా నీ, మద్ది వెంకటేశ్వర్లు కమిషన్‌లో నిబద్ధతతో పనిచేసే అధికారుల్లో ఒకరు. గ్రూప్-2 ద్వారా నియమితులైన ఆయ న సివిల్స్‌లోనూ మెయి న్స్ వరకు వెళ్లా రు. ఆయనకు గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 64 మార్కులు మాత్రమే వచ్చాయి. మెయిన్స్‌కు ఎంపికే కాలేదు. కానీ, ప్రవీణ్‌కుమార్ మాత్రం నాలుగు పేపర్లు చేతిలో పట్టుకొని, మార్కుల లిస్టే తన దగ్గర ఉన్నది.. అన్నట్టు బిల్డప్ ఇచ్చారు.