RS Praveen Kumar | హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి కొండా సురేఖ గురుకులాలపైనా, వ్యక్తిగతంగా తనపైనా మతిస్థిమితం లేని వ్యా ఖ్యలు చేశారని రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ అంటే బీర్లు, బిర్యానీ ఉండాల్సిందేనని గతంలో వ్యాఖ్యానించిన ఆమె తన చిత్తశుద్ధిని శంకిస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎంత మంది పోలీసులను పెట్టినా బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాట ఆగబోదని స్పష్టంచేశారు. ఈ నెల 30 (శనివారం) నుంచి చేపట్టనున్న బీఆర్ఎస్ గురుకుల బాట, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ విద్యాలయాల్లో నడుస్తున్న పరిణామాలపై శుక్రవారం ఆయన నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలను వివరించారు. ఆయన ఇంటర్వ్యూ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్ఎస్పీ: కొండా సురేఖ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. విద్యాలయాల్లో విషాహార సం ఘటనలు ఎందుకు జరుగుతున్నయి? వాటి నివారణ చర్యలు తీసుకోకుండా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, పిల్లలలో కలిసి తినకుండా, పాఠశాలలకు వెళ్లకుండా గాంధీభవన్‌లో కూర్చొని అందు లో నా కుట్ర ఉన్నదని చెప్పడం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమస్యను పక్కదారి పట్టించడమే అవుతుంది. నేను గురుకులాల కార్యదర్శిగా 9 ఏండ్లు పనిచేసిన. అందులో రెండేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రోత్సాహంతో గురుకులాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ అయి న హార్వర్డ్ యూనివర్సిటీలో మన గురుకులాలు కేస్ స్టడీ, వరల్డ్ బ్యాంక్ కేస్ స్టడీ ఎందుకు అయింది. అలాగే దేశంలోని అనేక రాష్ర్టాలకు మన గురుకులాలు మాడల్ ఎందుకయ్యాయి? గురుకుల విద్యార్థుల కోసం చిత్తశుద్ధితో పనిచేసిన. నా కమిట్మెంట్ చూసే కేసీఆర్ గురుకుల పాఠశాలల సంఖ్యను గణనీయంగా పెంచారు. విద్యా ప్రమాణాల పెంపులో కేసీఆర్ ప్రభుత్వం ప్రపంచ రికార్డు నెలకొల్పితే, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విద్యార్థులను చంపడంలో రికార్డును సృష్టిస్తున్నది.
మమ్మల్నే కాదు మా నీడను కూడా చూసి.. కాం గ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు భ యపడుతున్నరు. అందుకు రేవంత్‌రెడ్డి, కొండా సు రేఖ, సీతక్క, కవ్వంపల్లి సత్యనారాయణ వంటి వారి మాటలే నిదర్శనం. కేసీఆర్ మార్గదర్శకంలో మేం గురుకులాల బాట నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. గురుకులబాట రాజకీయ కోణం లేదని స్పష్టంగా చె ప్పారు. ప్రభుత్వ విద్యాలయాల్లో ఏం జరుగుతుం ది? అనే విషయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఏం చేయాలో ప్రభుత్వానికి సూచించే ఒక ని ర్మాణాత్మక కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి మేం తెలుసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. అర్థవంతమైన చర్చ కోసం, గురుకులబాట అనే కార్యక్రమం అనగానే రేవంత్‌రెడ్డికి ఎందుకు వెన్నులో వణుకు పుడుతున్నది. 48-50 మంది పిల్లలు చనిపోయేదాకా ప్రభుత్వం ఏం చేసినట్టు? అందులో మంత్రులు ఏమి చేసినట్టు? ఒకటే జిల్లాల్లో పదుల సంఖ్యలో సంఘటనలు జరుగుతుంటే… ఒకే హాస్టల్లో 10 రోజుల వ్యవధిలో నాలుగైదు ఘటనలు చోటుచేసుకుంటుంటే ఎందు కు పట్టించుకోలేదు. ఒకే స్కూల్లో ఇద్దరు పాముకాటుతో ఎట్లా చనిపోతరు? విషాహారం తిని ఒక అమ్మాయి ఎట్లా చనిపోద్ది. నిమ్స్‌లో చావు బతులకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యార్థినిని ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా చూసేందుకు రేవంత్‌రెడ్డి ఎందుకు రాలేదు? బాధ్యతాయుత ప్రతిపక్షంగా బీఆర్ఎస్ చేపట్టిన కార్యక్రమాన్ని చూసి వాళ్లకు భయం పట్టుకున్నది. అందులో భాగంగానే నాపైన, కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నరు.
నేను వందల కోట్లు వృథాచేస్తే విచారణకు ఆదేశించండి. అవసరమైతే నాపైన సీబీఐ ద్వారా విచారణ చేయించి నన్ను జైలుకు పంపండి. వాళ్ల ప్రభుత్వమే ఉన్నది. ఎవరొద్దన్నరు. నేనొద్దన్నానా? సమ స్య మాట్లాడమంటే వ్యక్తిగత విమర్శలకు దిగి సమస్యను పక్కదోవ పట్టించాలనే దురుద్దేశ భావన తప్ప మరోటి కాదు.
బీర్లు బిర్యానీలు లేకుండా పార్టీలు జరుగుతయా? అని గతంలో కొండా సురేఖ మాట్లాడింది నిజమా? కాదా? కేటీఆర్‌పైన కొండా సురేఖ గతం లో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, ఆమెపైన కేసు నమోదు చేయాలని కోర్టు మొట్టికాయలు వేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటి కొండా సురేఖకు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? మా పిల్లలకు బీర్లు కాదు.. బుక్కులు కావాలి, కల్లు కాదు కంప్యూటర్లు కావాలి, చెప్పులు కుట్టిన చేతులతోనే చరిత్రను తిరగరాయాలి, డప్పులు కొట్టిన చేతులతోనే డాలర్లు సంపాదించాలి.. అని మేము తిరిగినం.
వాడుకోవటానికి నేనేమైనా సరుకునా. పిల్లల జీ వితాలు బాగుపడాలని మేమొక ఉద్యమం చేస్తు న్నం. ప్రజారంగంలో ఉన్నాం. మాలో మాకు విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్రల ఎత్తుగడ అది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న కుట్ర వారిది. గురుకులాలను రక్షించుకునే బాధ్యతలో భా గంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నం. ఇందులో రాజకీయం ఏమున్నది? అందరం కలిసికట్టుగా టీమ్‌గా పనిచేస్తున్నం.
రేవంత్‌రెడ్డికి గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ విద్యాలయాల పిల్లలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బహిరంగ చర్చకు రావాలని నేను బహిరంగ సవాల్ విసురుతున్న. నేను సమగ్ర వివరాల డాటా తీసుకొ ని వస్తా. రేవంత్‌రెడ్డి కూడా డాటా పట్టుకొని రావా లి. విద్యార్థుల జీవితాలను ఎవరు నిర్మించారు? ఎవ రు కాపాడారు? ఎవరు నాశనం చేస్తున్నరో తెలిసిపోద్ది. సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ చర్చకు వచ్చే ధైర్యంలేక, మతిస్థిమితం లేని మంత్రుల చేత ఎందు కు మాట్లాడిస్తున్నరు? సీఎం, మంత్రులు ఎవరైనా పాఠశాలలకు పోయారా? ఎప్పుడన్న పిల్లలతో కలిసి భోజనం చేసిండ్లా? వారి ఇండ్లల్లకు పోయిండ్లా? వారి కష్టసుఖాలు అర్థం చేసుకున్నరా?
తప్పకుండా పూర్తిచేస్తం. ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు అన్నింటినీ పరిశీలిస్తాం. పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తం. పోలీసులను పెట్టి ఎన్నిరోజులు కాపాడుతవు? అసలు విషయాన్ని బయటికి తెలియకుండా ప్రభుత్వం చూస్తున్నది. రేవంత్‌రెడ్డి పోలీసోళ్ల మీద ఆధారపడ్డడు. రేవంత్‌రెడ్డి ఎంత సీఎం అయినా గాలిని ఆపలేరు. నీటిని ఆపలేరు. నిప్పును ఆపలేరు. బీఆర్ఎస్ పార్టీని కూడా ఆపలేరు. మా బిడ్డల ప్రాణాల రక్షణ కోసం, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మేం ప్రకటించిన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతాం.