RS Praveen Kumar | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. పేదల ఇండ్లను కూలగొడుతూ.. పెద్దోళ్ల భవనాలను వదిలేస్తుందంటూ ఆయన మండిపడ్డారు.
హైడ్రాతో చెరువులను కాపాడతానని హైడ్రామా చేసి పేదోళ్ల గూడును కూల్చివేసి, ధనవంతులను(తిరుపతిరెడ్డితో సహా) కాపాడుతున్న రేవంత్ రెడ్డి గారు.. బండ్లగూడ జాగీరు మున్సిపాలిటీలో ఎంతో చరిత్ర ఉన్న పీరం చెరువు యధేచ్చగా ఆక్రమణకు గురవుతున్నది. నేను గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేశాను. అయినా చెరువులో నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.
వీళ్లు ఆర్ఆర్ ట్యాక్స్ కట్టిండ్రనేనా మీరు మీ హైడ్రా అధికారులు చూసిచూడనట్టున్నారు! మీ ప్రజా పాలన కేవలం భూమాఫియా కోసమేనా? అని రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
హైడ్రాతో చెరువులను కాపాడతానని హైడ్రామా చేసి పేదోళ్ల గూడు ను కూల్చివేసి, ధనవంతులను(తిరుపతిరెడ్డితో సహా) కాపాడుతున్న @revanth_anumula గారు,
బండ్లగూడ జాగీరు మున్సిపాలిటీ లో ఎంతో చరిత్ర ఉన్న పీరంచెరువు యధేచ్చగా ఆక్రమణకు గురైతున్నది. నేను గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసిన. అయినా… https://t.co/eBIEVJFuxj pic.twitter.com/DBxLJDBeoJ— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 18, 2025