హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సైబర్ నేరాలు తగ్గాయని చెబుతూనే.. ఈ ఏడాది ఆరు నెలల్లో ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.726 కోట్లు కొల్లగొట్టినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్ తెలిపారు. శుక్రవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో సైబర్ వారియర్లు, సీఎస్బీ అధికారులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు.
బాధితులు నష్టపోయిన దానిలో రూ.105 కోట్లను ఫ్రీజ్ చేయగా, రూ.102 కోట్లను రిఫండ్ చేసినట్టు చెప్పారు. నేరగాళ్లు ఉపయోగించిన 1,657సిమ్‌లు, 7,178 ఐఎంఈఐ నంబర్లు, 565 యూఆర్ఎల్లను బ్లాక్చేసినట్టు తెలిపారు. 2024తో పోలిస్తే రాష్ట్రంలో సైబర్ నేరాలు 16 శాతం తగ్గగా, దేశవ్యాప్తంగా 37శాతం పెరిగినట్టు వెల్లడించారు. ఉత్తమ వారియర్లకు ప్రశంసాపత్రాలు ఇచ్చారు.