హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ): యాసంగి పెట్టుబడి సాయంలో భాగంగా బుధవారం రైతుబంధు ద్వారా 2.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.564.08 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 59.08 లక్షల మంది రైతులకు రూ.5,318.73 కోట్లు పంపిణీ చేసినట్టు చెప్పారు. సాగుకు ముందే పెట్టుబడి సాయం చేస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుండటం వల్లే పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని చెప్పారు. దేశంలో అధికశాతం జనాభా ఆధారపడిన వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని, కేంద్రానికి సమగ్ర వ్యవసాయ విధానం లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. 8 ఏండ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యవసాయరంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని, వినూత్న పథకాలతో అన్నదాతకు అండగా నిలిచారని మంత్రి వివరించారు.