కొండాపూర్, అక్టోబర్ 6 : తెలంగాణ హరిత నిధికి హోప్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడు కొండా విజయ్‌కుమార్ రూ.5 వేల విరాళం ఇచ్చారు. భవిష్యత్తు తరాలకు అతి గొప్ప సంపదైన సస్యశ్యామల పర్యావరణాన్ని అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితనిధిలో భాగస్వామ్యమవడం సంతోషంగా ఉన్నదని చెప్పారు.