హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టళ్ల నిర్వహణకు ప్రభు త్వం రూ.14.93 కోట్లు మంజూరు చేసింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.59.73 కోట్లలో మొదటి విడతగా ప్రస్తుతం రూ. 14.93 కోట్లు మంజూరు చేసింది.
రాయికల్, జూన్ 10: బాలికపై లైంగికదాడి చేసిన వ్యక్తికి జగిత్యాల న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది. రాయికల్ పోలీస్స్టేషన్ పరిధిలో బాలికపై 2019 జులై 25న జైత భీమయ్య లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈకేసులో నేరం రుజువు కా వడంతో నిందితుడికి జిల్లా న్యాయమూర్తి రత్న పద్మావతి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.