హైదరాబాద్: ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసింది లేదు.. ఏడాదిలోనే ఎనలేని అప్పులు అంటూ మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలైందే లేదు, పిడికెడు మన్ను తీసింది లేదు.. కొత్తగా కట్టింది లేదు అప్పుడే లక్షన్న కోట్ల అప్పులంటూ ఫైరయ్యారు. రుణమాఫీ చేసింది లేదు, రైతు భరోసా ఇయ్యనే లేదు లక్షన్నర కోట్లు ఎవ్వరి పాలయ్యాయంటూ మండిపడ్డారు.
తెలంగాణను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలబెట్టి, తెలంగాణ వైభవాన్ని దశదిశలా చాటి.. పదేండ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వం మీద విషప్రచారం చేసిన సన్నాసులు.. కేవలం ఏడాది పాలనలో రూ.లక్షన్నర కోట్ల అప్పు ఎందుకు చేశారో ? ఎందుకు ప్రశ్నించరు? అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.
‘ఏం చేసింది లేదు.. ఏడాదిలోనే ఎనలేని అప్పులు. ఆరు గ్యారంటీలు అమలయిందే లేదు.. లెక్కకు మించి అప్పులు. పిడికెడు మన్ను తీసింది లేదు, కొత్తగా కట్టింది లేదు.. అప్పుడే లక్షన్నర కోట్ల అప్పులు. రుణమాఫీ చేసింది లేదు.. కోట్ల అప్పు ఎందుకయింది?. రైతు భరోసా ఇయ్యనేలేదు.. లక్షన్నర కోట్లు ఎవ్వరి పాలు?.
రూ.2 వేల ఫించను 4 వేలు కానేలేదు.. అప్పు తెచ్చిన కోట్లు ఎవ్వరిపాలు?. మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు రూ.2500 ఊసేలేదు.. లక్షన్నర కోట్ల అప్పు ఎందుకయింది ?. తులం బంగారానికి దిక్కేలేదు.. లక్షన్నర కోట్ల అప్పులో రాష్ట్ర సర్కార్. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్ రాలేదు లక్షన్నర కోట్ల అప్పు ఎందుకయింది?.
కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ సాగర్ కట్టి.. వందల టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించి, మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటలు బాగుచేసి, మిషన్ భగీరధ కింది ఇంటింటికి మంచినీళ్లిచ్చి, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి ఇచ్చి.. ఆసరా పింఛన్లతో అండగా నిలిచి, వెయ్యికి పైగా సంక్షేమ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి.. పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారంతో పచ్చదనం పెంచి, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి.. అన్ని రంగాలలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టి, దశదిశలా తెలంగాణ వైభవాన్ని చాటి.. పదేళ్లలో రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం మీద విషప్రచారం చేసిన సన్నాసులు, కేవలం ఏడాది పాలనలో.. రూ.లక్షన్నర కోట్ల అప్పు ఎందుకు చేశారో ? ఎందుకు ప్రశ్నించరు?’. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఏం చేసింది లేదు .. ఏడాదిలోనే ఎనలేని అప్పులు !
ఆరు గ్యారంటీలు అమలయిందే లేదు .. లెక్కకు మించి అప్పులు !
పిడికెడు మన్ను తీసింది లేదు .. కొత్తగా కట్టింది లేదు .. అప్పుడే లక్షన్నర కోట్ల అప్పులు
రుణమాఫీ చేసింది లేదు .. కోట్ల అప్పు ఎందుకయింది ?
రైతు భరోసా ఇయ్యనేలేదు .. లక్షన్నర… pic.twitter.com/65XLn93MtM
— KTR (@KTRBRS) January 6, 2025