భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు, ట్రిపుల్ ఆర్ రైతులు, మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వలిగొండలో ట్రిపుల్ ఆర్ బాధిత రైతులను, రాజాపేటలో సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. అక్రమ అరెస్టులపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఆలేరు నియోజకవర్గంలో రూ.1,500కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, తదితర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అనంతరం తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఆయా కార్యక్రమాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ పాల్గొననున్నారు.