హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు రెండు నెలల్లో అన్ని అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ట్రిపుల్ ఆర్కు సంబంధించి 95 శాతం భూసేకరణ పూర్తయిందని, క్యాబినెట్ ఆమో దం తర్వాత పరిహారం ఇస్తామని తెలిపారు. హైదరాబాద్-విజయవాడ ఆరు లైన్ల రహదారి నిర్మాణానికి రెండు ప్యాకేజీలుగా టెండర్లు పిలువాలని అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును కలిసి మామునూరు ఎయిర్పోర్ట్ గురించి చర్చించినట్టు తెలిపారు. రెండున్నరేండ్లలో ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు.
పెండింగ్ బిల్లుల కోసం ఒత్తిడి తీసుకురండి ; మండలి ప్రతిపక్ష నేత, డిప్యూటీ చైర్మన్కు సర్పంచుల జేఏసీ వినతి
హైదరాబాద్, మార్చి11 (నమస్తేతెలంగాణ): మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించేలా శాసనమండలి వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్లను సర్పంచుల జేఏసీ నాయకులు కోరారు. హైదరాబాద్లో మంగళవారం వారిని కలిసి వినతిపత్రం అందజేశారు.