Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు బరితెగించారు. దొంగ ఓటర్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ రోడ్డుపై రౌడీయిజానికి దిగారు. దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల ముందే శ్రీశైలం యాదవ్ దాడికి పాల్పడ్డారు.
యూసుఫ్‌గూడలోని మహబూబ్ ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓటర్లను అడ్డుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో పోలీసులపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయగా, మాగంటి సునీతను అక్కడ్నుంచి పంపించారు. కానీ రౌడీయిజానికి దిగిన శ్రీశైలం యాదవ్‌ను మాత్రం పోలీసులు అరెస్టు చేయలేదు. పైగా ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అడుగడుగునా ఘర్షణ వాతావరణం నెలకొంది.
రోడ్డుపై రౌడీయిజానికి దిగిన నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్
దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల ముందే దాడి చేసి కొట్టిన శ్రీశైలం యాదవ్
ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను జరపడానికి కూడా చేతకాని ప్రభుత్వం
దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై పోలీసుల ముందే బూతులు దాడి… https://t.co/ZMINbLo2SK pic.twitter.com/evCG7gtPIC
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025