హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : పుష్ప సినిమాలో హీరో అన్న ఒక్క డైలాగ్ నేరగాళ్లు ఇప్పుడు గట్టిగా ఒంట పట్టించుకున్నట్టున్నారు. రాష్ట్రంలో ఇటీవల నేరం చేయడం.. ‘దమ్ముంటే పట్టుకోరా షెకావతూ’ అంటూ పోలీసులకు డైలాగ్ వదలడం తరచూ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని మీర్‌పేట పరిధిలో ఓ రౌడీషీటర్‌ను హత్య చేసిన నిందితుడు కూడా ఏకంగా ఇన్‌స్టాలో లైవ్‌వీడియో పెట్టి మరీ ‘దమ్ముంటే ప ట్టుకోండి’ అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అ య్యింది. వివరాలు.. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ నందనవనం సూరి దా రుణ హత్య సోమవారం అర్ధరాత్రి కలకలం రేపింది. టీకేఆర్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోగా పాతకక్షలే ఈ హత్య కు కారణంగా పోలీసులు వెల్లడించారు. నందనవనం సూరిపై గతంలో వరంగల్, హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తన మొదటి భార్య, బావమరిది సల్మాన్ హత్య కే సుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు.
అతనిపై నగర బహిష్కరణ కూడా ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా తన రెండోభార్య త మ్ముడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు సూరి సోమవారం అర్ధరాత్రి నందనవనం వె ళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ సో దరుడు అఫ్రోజ్ అక్కడికి చేరుకున్నాడు. ముందుగా సూరి కండ్లలో పెప్పర్‌స్ప్రే చల్లి, కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీ వ్రంగా గాయపడిన సూరిని స్థానికులు వెంట నే దవాఖానకు తరలించారు. కానీ అప్పటికే సూరి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడు అఫ్రోజ్‌తో పాటు మిగతా వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.