హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓల్డ్ మలక్‌పేటలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముస్తాక్ అనే రౌడీ షీటర్‌ను దుండగులు కత్తులతో నరికి చంపేశారు. స్థానికుల సమాచారంతో చాదర్‌ఘాట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ హత్యపై కేసు నమోదుచేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు భావిస్తున్నారు.